శర్వా వెనక్కి తగ్గాడా ?

శర్వా వెనక్కి తగ్గాడా ?

శర్వానంద్ నటించిన తాజా చిత్రం 'రణరంగం'.  ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేయడం జరిగింది.  కొన్ని రోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచింది.  దీంతో ప్రేక్షకులు చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ముందుగా ఈ సినిమాను ఆగష్టు 2వ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.  అంటే ఇంకో 15 రోజుల గడువు మాత్రమే  ఉంది.  పాటలు, ట్రైలర్ ఏవీ రాలేదు.  దీంతో సినిమా వాయిదాపడిందనే వార్తలు ఊపందుకున్నాయి.  మరి నిజంగానే సినిమా వెనక్కి తగ్గిందో లేకపోతే అదే రోజున వస్తుందో నిర్మాతలే క్లారిటీ అవ్వాలి.