శ్రీకారం సిద్దమైంది.. ఎప్పుడంటే..

శ్రీకారం సిద్దమైంది.. ఎప్పుడంటే..

టాలీవుడ్‌లో జయాపజాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఎప్పటికప్పుడు విభిన్న కథలతో సినిమాలు చేస్తారు. కెరీర్ ప్రారంభం నుంచి కూడా పారితోషికంపై కన్నా కథపై దృష్టి పెట్టి మంచి సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న సినిమా శ్రీకారం. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిశ్చయించుకున్నారు. ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకుంది. ఈ మేరకు శర్వానంద్ ‘పంట చేతికొచ్చింది’ అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు అన్నీ కూడా మంచి ప్రజాదరణ పొందాయి. ఇదిలా ఉంటే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్టన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ, శర్వానంద్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.