తిరుపతిలో ప్రారంభమైన శర్వా 'శ్రీకారం'...

తిరుపతిలో ప్రారంభమైన శర్వా 'శ్రీకారం'...

యంగ్ హీరో శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవల జాను  సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా రైతుగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ , టీజర్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 24 విడుదల చేయాలనీ చిత్రయూనిట్ భావించినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడి ఆలస్యం అయ్యింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ అన్ని ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుండటంతో శర్వా 'శ్రీకారం' కూడా తిరుపతిలో ప్రారంభమైనట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా తెలిపారు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్‌ మోహన్ హీరోయిన్ గా‌ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమా చేయనున్నాడు .