స్థిరంగా ముగిసిన మార్కెట్లు

స్థిరంగా ముగిసిన మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు నిలకడగా ముగిశాయి. స్వల్పంగానైనా.. రోజంతా సూచీలు ఒడుదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా క్షీణించడంతో పాటు రూపాయి స్థిరంగా ఉండటంతో మార్కెట్‌ స్వల్ప నష్టంతో ముగిసింది. నిఫ్టి 13 పాయింట్లు, సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ రెడ్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్పంగా క్లోజ్‌ కాగా.. ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. యూరో మార్కెట్లు కూడా ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. కార్పొరేట్‌ ఫలితాలు పూర్తవుతున్న తరుణంలో, ఫెడ్‌ భయాలు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయి. 

నిఫ్టిలో 28 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా.. 22 నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో భారీ లాభాలతో ముగిసిన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన టాప్‌ నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, గెయిల్‌ ఉన్నాయి. ఇతర షేర్లలో ఇన్ఫీబీమ్‌ 15 వాతం, పీసీ జ్యువెల్లర్స్‌ 10 శాతం, జేపీ అసోసియేట్స్‌ 5 శాతం మేర పెరిగాయి.