రెండో సెషన్ పూర్తి... నిలబడిన శార్దుల్, సుందర్

రెండో సెషన్ పూర్తి... నిలబడిన శార్దుల్, సుందర్

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు నాల్గవ టెస్ట్ మూడో రోజు ఆటలో యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్(38), శార్దుల్ ఠాకూర్(33)తో ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడి 67 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. దాంతో భారత జట్టు 253/6 తో నిలిచింది. అయితే ఇంకా కూడా ఆసీస్ కంటే 116 పరుగులు వెనకబడి ఉంది టీం ఇండియా.

ఇక ఇంతకముందు ఈరోజు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మయాంక్ తో మంచి భాగసౌమ్యం ఏర్పాటు చేస్తున్న సమయంలో స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ రూపంలో రహానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత రెండో బంతికే మయాంక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా అదే దారిలో పెవిలియన కు చేరుకున్నాడు. దాంతో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు సుందర్, శార్దుల్ రాణించడంతో కొంత పటిష్టమైన స్థితికి చేరుకుంది. ఇక ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 37 ఓవర్లు మిగిలి ఉంది.