నిషేధం ముగుస్తుండటంతో శిక్షణకు షకీబ్...

నిషేధం ముగుస్తుండటంతో శిక్షణకు షకీబ్...

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పోటీ క్రికెట్‌లోకి తిరిగి రాకముందే వచ్చే నెల నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఆరోపించిన భారతీయ బుకీ అవినీతి విధానాలను బోర్డుకు నివేదించడంలో విఫలమైనందుకు షకీబ్ ను రెండు సంవత్సరాలు నిషేధించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ దానిని ఒక సంవత్సరానికి కుదించారు. దాంతో అతని నిషేధం ఈ ఏడాది అక్టోబర్ 29 తో ముగుస్తుంది. కాబ్బటి షకీబ్ వచ్చే నెలలో బంగ్లా శిక్షణ శిబిరానికి రానున్నాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్న 33 ఏళ్ల షకీబ్, అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధం కావడానికి ఆగస్టు చివరిలో బంగ్లాకు తిరిగి రావాలని ఆలోచిస్తునాడు. గత ఏడాది జరిగిన 2019 ప్రపంచ కప్‌లో 606 పరుగులు సాధించిన షకీబ్ నిషేధానికి ముందు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు షకీబ్ 56 టెస్టుల్లో 210 వికెట్లు పడగొట్టి 3,862 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో 206 వన్డేలో 6,323 పరుగులు, 260 వికెట్లు అలాగే  76 టీ 20లో 1,567 పరుగులు, 92 వికెట్లు సాధించాడు.