మోడీ ప్రభుత్వం ఉండగా అది సాధ్యం కాదు : షాహిద్ ఆఫ్రీది

మోడీ ప్రభుత్వం ఉండగా అది సాధ్యం కాదు : షాహిద్ ఆఫ్రీది

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండగా భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ సాధ్యం కాదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది అభిప్రాయపడ్డారు. ఆఫ్రీది మాట్లాడుతూ... భారత్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. కానీ ప్రస్తుత భారతదేశంలో ఉన్న పాలనతో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను తిరిగి ప్రారంభించే అవకాశాలు లేవు. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అది జరుగుతుంది అని నేను అనుకోను" అని షాహిద్ పేర్కొన్నారు. అయితే అంతకముందు షాహిద్ ఆఫ్రీది ఓసారి మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసి భారత ప్రజలు, ఆటగాళ్ల ఆగ్రహానికి గురయ్యాడు. అయిన కూడా ఇప్పుడు మళ్ళీ భారత ప్రధాని పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఆఫ్రీది పై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నగదు అధికంగా ఉండే ఐపీఎల్ టీ 20 లీగ్ క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద బ్రాండ్. కానీ అందులో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడకపోవడం వల్ల వారు పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నారని షాహిద్ తెలిపాడు. అయితే కరోనా కారణంగా ప్రారంభం అవుతుందా.. లేదా అనుకున్న ఐపీఎల్ 2020 యూఏఈ వేదిక ప్రారంభమై విజయవంతగా కొనసాగుతుంది.