తన వైఫల్యాన్ని భారత్ అదృష్టం అంటున్న ఆఫ్రీది...

తన వైఫల్యాన్ని భారత్ అదృష్టం అంటున్న ఆఫ్రీది...

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది మరోసారి భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఈ మధ్య ఆఫ్రీది ట్విట్టర్ లో చిట్ చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అందులో ఒకరు... 'ప్రపంచ కప్ లలో మీరు భారత్ కు వ్యతిరేకంగా ఎందుకు అంత విఫలమయ్యారు. 5 ప్రపంచ కప్ మ్యాచ్ లలో కలిపి కేవలం 85 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నారు.. ఎందుకు..?' అని సూటిగా ప్రశ్నించాడు. దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక 'బహుశా.. అది భారత్ అదృష్టం కావచ్చు' అంటూ సమాధానం ఇచ్చాడు. 

అయితే తన వైఫల్యాన్ని భారత్ అదృష్టం అని వ్యాఖ్యానించడంతో భారత అభిమానులు ఈ విషయం పై స్పందిస్తూ ఆఫ్రీది ని ఆడుకున్నారు. ఒకరు.. ''1999 నుండి ఆఫ్రీది భారత్ కు వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్లలో 29 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు అని వివరించాడు. అయితే ప్రపంచ కప్ లలో భారత కు వ్యతిరేకంగా ఆఫ్రీది 1999 లో 6 పరుగులు, 2003 లో 9 పరుగులు, 2007 లో 29 పరుగులు, 2011 లో 19 పరుగులు ఇక చివరగా 2015 లో 22 పరుగులు మాత్రమే చేసాడు. ఇక మరికొందరు నెటిజన్లు ఈ విషయం పై గౌతమ్ గంభీర్ స్పందించాలి అని కూడా కోరారు.