సోషల్ మీడియాలో అభిమాని ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చిన క్రికెటర్... 

సోషల్ మీడియాలో అభిమాని ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చిన క్రికెటర్... 

కరోనా కారణంగా వచ్చిన విరామం నుండి కేవలం ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రమే బయటపడ్డారు. వరుస సిరీస్ లు ఆడుకుంటూ దూసుకపోతున్నారు. అయితే ఇంకా చాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు ఈ లాంగ్ బ్రేక్ నుండి విముక్తి ఇవ్వలేదు. అందువల్ల చాలా మంది క్రికెటర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అదే తరహాలో ఈ రోజు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ట్విట్టర్లో అభిమానులు అడిగినా వాటికి సమాధానం ఇచ్చాడు. అయితే అందులో ఓ అభిమాని ముందుగా ఆఫ్రీదిని ‘మీ వయసు ఎంత..?’ అని ప్రశ్నించగా దానికి ‘వయసు అనేది కేవలం ఒక నెంబరు మాత్రమే’ అని చెప్పాడు. ఆ వెంటనే మరో అభిమాని ‘మీ ఫోన్ నెంబరు చెప్పండి లాలా. జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలుసుకోలనుకుంటున్నాను’ అని అనగా దానికి సమాధానం ఇస్తూ.. ‘12345678910’ అని చెప్పి అతనికి సమాధానం ఇచ్చాడు. దాంతో ఏం అనాలో తెలియక అతను సైలెంట్ అయిపోయాడు.