కలర్ తో... కలవరం ఉండదంటున్న షారుఖ్‌!

కలర్ తో... కలవరం ఉండదంటున్న షారుఖ్‌!

షారుఖ్ ఖాన్ కి కమర్షియల్ యాడ్స్ కొత్త కాదు. లక్స్ సబ్బు మొదలు మగవాళ్ల కోసం ఫెయిర్ నెస్ క్రీమ్ వరకూ ఆయన ఎన్నో ప్రాడక్ట్స్ ఎండార్స్ చేశాడు. తాజాగా స్ట్రీక్స్ హెయిర్ కలర్ కూడా ఎస్ ఆర్కే ఖాతాలో పడింది. 'పఠాన్' షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ టెలివిజన్ యాడ్ కోసం ఆయన సమయం కేటాయించాడు. డైరెక్టర్ గౌరీ షిండే సరికొత్త స్ట్రీక్స్ యాడ్ కి దర్శకత్వం వహించింది. హెయిర్ డై వేసుకోవటం అంత సింపుల్ పనితో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పటమే షారుఖ్ యాడ్ లోని సారాంశం. బాద్షాకి అదే పాయింట్ నచ్చటంతో కమర్షియల్ లో నటించేందుకు సై అన్నాడట. స్ట్రీక్స్ హెయిర్ డైకి సంబంధించిన ప్రతినిధులు సైతం కింగ్ ఖాన్ తో కలసి ముందుకు సాగటం... తమ బ్రాండ్ కు కలసి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీపిక పదుకొణేతో కలసి 'పఠాన్' సినిమా చేస్తోన్న షారుఖ్ ఖాన్ నెక్ట్స్ అట్లీ, రాజ్ కుమార్ హిరానీ, రాజ్ అండ్ డీకే వంటి దర్శకులతో మూవీస్ చేయనున్నాడు.