అందులో అతిధి పాత్ర నిజమే...
స్టార్ హీరోలు సినిమాల్లో అతిధి పాత్రల్లో కనిపిస్తే... ఫ్యాన్స్ కు పెద్ద పండగ చేసుకున్నట్టే. అతిధి పాత్రల్లో నటించడానికి స్టార్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఓ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. కోలీవుడ్ లో విజయ్... అట్లీ సినిమాలో షారుక్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇందులో షారుక్ అతిధి పాత్ర చేయడం లేదు.
అయితే, బాలీవుడ్ లో క్వీన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్న మెంటల్ హై క్యా సినిమాలో షారుక్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ న్యూస్ ను యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. షారుక్ పాత్ర ఏంటి.. ఎంత సమయం ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)