తెలుగు దర్శకుడి సినిమాలో షారుక్ ఖాన్ !

తెలుగు దర్శకుడి సినిమాలో షారుక్ ఖాన్ !

 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి బాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.  అదే 'మెంటల్ హై క్యా'.  ఇందులో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు నటిస్తున్నారు.  బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం మేరకు స్టార్ హీరో షారుక్ ఖాన్ సైతం ఇందులో అతిథి పాత్ర చేయనున్నారని తెలుస్తోంది.  అయితే ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం అందలేదు.  ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 29న విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ప్రకాష్ కోవెలమూడి గతంలో అనుష్క ప్రధాన పాత్రలో 'సైజ్ జీరో' అనే సినిమాను డైరెక్ట్ చేశాడు.