బాలీవుడ్ సరికొత్త ప్రయోగం ..

బాలీవుడ్ సరికొత్త ప్రయోగం ..

సినిమా ఇండ్రస్టీలో రోజురోజుకు ట్రెండ్ మారుతూ వస్తుంది. సినిమాల విషయంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే యాక్షన్ , ఫ్యామిలీ , పీరియాడిక్ , యానిమేషన్ అంటూ అన్ని రకాల సినిమాలు వచ్చాయి . ఈ మధ్య బోల్డ్ కంటెంట్లకు ఆదరణ పెరిగింది. ఇవికాకూండా కొంతమంది  కొత్త కొత్త ప్రయోగాలను కూడా చేస్తున్నారు. బాలీవుడ్ జనాలు బోల్డ్ కంటెంట్ ఆదరిస్తారు. ఇటు ఫ్యామిలీ కంటెంట్ ఆదరిస్తారు. ఇక ఆడవారి ప్రెగ్నెన్సీ గురించి సినిమాలు రూపొందించిన బాలీవుడ్ మేకర్స్ త్వరలో 'మేల్ ప్రెగ్నెన్సీ' అంటే మగవారు గర్భం దాల్చడం పై సినిమా తీయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త దేశమంతా వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో జనాలలో కూడా ఆసక్తి మొదలైంది. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారట. చూడలి మరి ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో . .