తెలకపల్లి రవి విశ్లేషణ : దేశంలో తీవ్రంగానే కరోనాముప్పు, రికవరీ రేట్లు అతిశయోక్తులే!

తెలకపల్లి రవి విశ్లేషణ : దేశంలో తీవ్రంగానే కరోనాముప్పు, రికవరీ రేట్లు అతిశయోక్తులే!

ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన లాక్‌డౌన్‌ విధించి 130 కోట్ల పైగాజనాభాను ఆంక్షలలో బంధించినా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భారత దేశం దారుణంగా విఫమైందని వాస్తవాలు  చెబుతున్నాయి.మృతుల సంఖ్య 90వేలు దాటిపోగా రోజుకు 90 వేలమంది కొత్తగా వైరస్‌కు గురవుతున్న పరిస్తితి. నిన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ద్వారా మరో30క్షమందిని కరోనా బారిన పడకుండా కాపాడామని మరణాలు  కూడా మరో  30,40వేలు పెరగకుండా నిరోధించామని ప్రకటించారు. అన్నిటినీ మించి దేశంలో మరణాల రేటు కన్నా  కోలుకున్న వారి సంఖ్య లేదా రికవరీ రేటు ప్రపంచంలోనే ఎక్కువగా వుందని చెబుతున్నారు. ఇవన్న వాస్తవ విరుద్దంగా వున్నాయని ఆరోగ్యరంగ నిపుణలు హెచ్చరిస్తున్నారు. మరణాలకు సంబంధించి  అమెరికా బ్రెజిల్‌ తర్వాత భారత దేశమే మూడో స్థానంలో వుంది.రోజు వారి పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో వుంది. మనంఅమెరికాను దాటిపోయే రోజు కూడా ఎంతో దూరంలో లేదంటున్నారు. పరీక్షలు తక్కువగా జరపడం, జనన మరణాల నమోదు ఖచ్చితంగా లేకపోవడంతో పాటు రికవరీ రేటు లెక్కించే విధానం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లుహెచ్‌వో) చెప్పిన దానికి భిన్నంగా వుండటం వలన ఇలాటి అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఏర్పడుతున్నదని నిపుణలు వివరిస్తున్నారు.  దేశంలో కరోనా వ్యాధిగ్రస్తులు మరణాల సంఖ్య 1.67 శాతం మాత్రమేనని చెప్పడం అశాస్త్రీయమైంది. మరణాల సంఖ్యను కోలుకున్నవారి సంఖ్యతో భాగించడం ద్వారా రికవరీ రేటు లెక్కకట్టాని కనీసం పరిష్కారమైన కేసుతో విభజించాలని డబ్య్లుహెచ్‌వో చెబుతున్నది. కాని మనం మాత్రం మొత్తం కేసు సంఖ్యతో మరణాలను భాగించి రికవరీ రేటు లెక్క కడుతున్నాం, అయినా ప్రతి 30, 35 రోజుకొకసారి పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్న పరిస్థితి.ఈ విదంగా చూస్తే అక్టోబర్‌ చివరకు మరో 80వేల మరణాలు సంభవించవచ్చు.వాషింగ్టన్‌ యూనివర్సీటీ ఆరోగ్య వివరాల విభాగం అంచనా ప్రకారం ఈ తీవ్రతను తగ్గించలేకపోతే ఇండియాలో ఆరులక్షల మందికి పైగా మరణించే ప్రమాదం వుంది, ఇవన్నీ ప్రభుత్వం చెప్పే లెక్క ఆధారంగాచేసినపరిశీనలేగాని ఉత్తుత్తిలెక్కుకావు,భయపెట్టే ప్రయత్నాలు కావు.  

            ప్రపంచంలో చాలా దేశాలో కోవిడ్‌ 19 మలి దశ మొదవుతుందని సన్నద్ధమవుతుంటే మన దేశం ఇంకా మొదటి దశ విజృంభణలోనే వుంది. లాక్‌డౌన్‌ వలన అన్ని దేశాలో వైరస్‌ వ్యాప్తి అరికట్టబడితే మన దేశంలో మాత్రం ఆ తర్వాత మరింత పెరిగింది.భారత ప్రజారోగ్యసంస్థ, అంటువ్యాధుల సామాజిక వ్యాధుల నివారణ సంస్థ, వ్యాధి నిరోధక సంస్త కూడా దేశంలో పరిస్తితి పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ  మే నెలాఖరులోనే సంయుక్త ప్రకటన చేశాయి. కేంద్రం నియమించిన టాస్క్‌ ఫోర్స్‌ కూడా అదే చెప్పింది.అయినా తర్వాత కూడా కేంద్రం చాలా రాష్ట్రాల తీరు మార్చుకోలేదు. ప్రతి  పదిక్షల మందికి 3328మందికి మాత్రమే పాజిటివ్‌ వస్తున్నదనీ 55మరణాలు నమోదవుతున్నాయని ఆరోగ్య మంత్రి చెప్పిన లెక్కు కూడా సమగ్రమైనవి కావు.అదే నిజమైతే అంత వేగంగా రెట్టింపు రేటు వుండేది కాదు, కోవిడ్‌  బారిన పడిన 200 దేశాలను తీసుకుంటే  నివారణలో చికిత్సలో భారత దేశం 129 వస్థానంలో వుంది.కనుక ఉపేక్షకు ఎంతమాత్రం అవకాశం లేదని అఖిభారత ప్రజాసైన్స్‌ ఉద్యమ నాయకుడు ప్రబీర్‌ పుర్ఖాయస్థ హెచ్చరించారు. భారత దేశ జనాభాలో యువత శాతం అధికంగా వున్నందున  లెక్కు కొంత తక్కువగా కనిపించవచ్చు  ఈ దేశంలో సగటు మధ్యంతర వయస్సు 26.8 సంవత్సరాలు కాగా ఇటలీలో అది 43 ఏళ్లపైన వుంటుంది. యువ జనాభా ఇంత ఎక్కువ వున్నా కేసు  రెట్టింపు రేటయ్యే వేగం ఆందోళనకరంగానేవుంది. ఈ పరిస్తితుల్లో వీటిని ఎలా అరికట్టానే విధానపరమైన సమీక్ష జరిపి పార్లమెంటుకు తెలియజేసే బదులు కేంద్రం అంతా బాగానేవుందన్న చిత్రణ ఇవ్వడం అవాస్తవికతకు అద్దంపడుతుంది,సెప్టెంబరు రెండవ వారానికి మూడవ వారానికి మద్య పాజిటివ్‌ కేసు 2.6 శాతంతగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. ఇదే కాలంలో పరీక్షల సంఖ్య 8.4శాతం తగ్గిందని కూడా చెప్పాల్సి వుంటుంది.  పరీక్షలో అయిదు శాతం పాజిటివ్‌ కేసు వున్నప్పుడు మరింత పెంచాలే గాని తగ్గించడం వలన వ్యాప్తి పెరిగినానమోదు కాకుండా పోతాయని దానివలన భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య ఆర్థిక నిపుణుడు రియో ఎంజాన్‌ విశ్లేషించారు, ఇలా పరీక్ష సంఖ్య  తగ్గిపోతుండడం వలన వైరస్‌ తాకిడి తగ్గిందనే పోరబాటు అభిప్రాయం పెరుగుతోందని అంటువ్యాధు నిపుణలు ఒ.త్యాగి హెచ్చరించారు, కాని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఈ హెచ్చరికను  కొట్టిపారేయడం ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తున్నది.

            మరోవైపున కేవలం ఏడు రాష్ట్రాల్లోనే దాదాపు డెబ్బై శాతం పాజిటివ్‌ కేసులు వుంటున్నాయంటూ ప్రధాని మోడీ వాటి ముఖ్యమంత్రుతో సమావేశం జరిపారు. ఎపి తమిళనాడు మహారాష్ట్ర పంజాబ్‌, ఢల్లీి,ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటకలే తాకిడి ఎక్కువగా వుందని గుర్తించడం బాగానే వుంది గాని ఈ సమావేశంలో పరిష్కారాపై కొత్తగా వ్యూహం రూపొందించినదేమీ లేదు. పరీక్షు జరిపితే మరిన్ని రాష్ట్రాల ఈ జాబితాలోచేరతాయనే భావన బాగా వుంది.  ఈ విషయంలో విజయంసాధించి ఐరాస మన్నన పొందిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ కూడా మలిదపా విజృంభణ గురించి హెచ్చరిస్తుంటే కేంద్రం ఆ పాఠాలు  తీసుకోవడం లేదు. పంచుకోవడం లేదు. వైద్యశాలల పడక పెంపులో గాని కార్పొరేట్‌ ఆస్పత్రును  ఒప్పించి సేవను వినియోగించుకోవడంలో గాని సరైన  ఆహారం మాస్కు కిట్లు వంటివి పెంచడంలో గాని పెద్ద పురోగమనం లేదు.  ఉద్యోగులకు అదనంగా సాయపడవసిందిపోయి జీతాల కోతలు, తొలగించేహక్కు యాజమాన్యాలకు కల్పించారు. గ్రామాలలో పనులు చాలడంలేదు. ఆఖరుకు  వైరస్‌ వ్యాప్తిపై పోరాడాల్సిన ఆసుపత్రుల ఔట్‌సోర్సింగ్‌ వైద్యసిబ్బంది, జూనియర్‌ డాక్టర్ల వంటివారు ఆందోళనలు చేయవలసి వస్తున్న స్తితి.వారినిదాడుల నుంచి కాపాడేందుకు ఒక శాసనం తీసుకువచ్చిన కేంద్రం ఆర్ధికంగా ఆదుకోవడానికి ముందుకు రాదు,  చప్పట్లు దీపాలతో మొదలై లాక్‌డౌన్‌ వరకూ సాగిన మన కరోనా వ్యూహం  విఫలత దేశానికి పెద్ద హెచ్చరిక.కేంద్ర రాష్ట్రాలో  మంత్రులు ప్రజా ప్రతినిధులు ఎందరో ప్రాణాలు వదిలారంటేసామాన్యు గురించిఏం చెప్పగం? ప్రజలలోనూ మాస్కు పెట్టుకోవడం జాగ్రత్తలు  తీసుకోవడం  పెరగాన్నది మరో అంశం. అతిశయాలు ఆత్మ వంచన మాని నిజంగా ప్రజను ఆదుకోవడానికి ముందుకు రావసిన సమయమిది.  ఇంకా సమయం తీసుకునే వాక్సిన్‌ కోసం నిరీక్షణ కన్నా అది ముఖ్యమైన కర్తవ్యం.