వారం రోజుల్లో 11 లక్షలకు పైగా కేసులు...లాక్ డౌన్ దిశగా ఆ నగరాలు 

వారం రోజుల్లో 11 లక్షలకు పైగా కేసులు...లాక్ డౌన్ దిశగా ఆ నగరాలు 

కరోనా వైరస్ అమెరికా దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది.  అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు రోజువారీ కేసులు 70 నుంచి 80 వేల వరకు ఉండేవి.  ఎన్నికల తరువాత కేసుల సంఖ్య లక్షన్నర దాటింది.  రోజువారీ మరణాల సంఖ్య కూడా 1500 వరకు నమోదవుతున్నాయి.  దీంతో అమెరికా అప్రమత్తం అయింది.  ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.  గత వారం రోజుల వ్యవధిలో 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ నగరంలో రోజువారీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో పాఠశాలలను మూసేశారు.  దీంతో పిల్లలు ఇంటికే పరిమితం అయ్యారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.  కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటె, నగరంలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నది. అమెరికాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన చికాగో నగరంలో కూడా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  దీంతో నగరంలోని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.