తూ.గో జిల్లా ప్రమాదంపై జనసేనాని తీవ్ర దిగ్భ్రాంతి

తూ.గో జిల్లా ప్రమాదంపై జనసేనాని తీవ్ర దిగ్భ్రాంతి

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హజరై, సొంత గ్రామాలకు చేరుకొనే మార్గములో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వాహనం బ్రేకులు సరిగ్గా పడకపోవడంతో వ్యాన్ అదుపు తప్పి, మెట్ల మార్గం ద్వారా కొండ కిందకి బోల్తా పడింది. అయితే అక్కడికక్కడే అయిదుగురు మృతి చెందగా, ఆసుపత్రికి తరలించెప్పుడు మరో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన గోకవరంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంతో ఆనందంగా వెళ్లివేడుకలకు వెళ్లివస్తున్న వారు ఈ ప్రమాదానికి గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను, తూర్పు గోదావరి జిల్లా అధికారులను కోరారు.