రివ్యూ: సెవెన్ 

రివ్యూ: సెవెన్ 

నటీనటులు: హవీష్, రెజీనా, నందితా శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజిత పొన్నాడ, రెహమాన్, సత్య తదితరులు

మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ 
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత: రమేష్ వర్మ 
ఛాయాగ్రహ‌ణం, దర్శకత్వం: నిజార్ ష‌ఫీ. 

థ్రిల్లర్ జానర్లో తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి.  థ్రిల్లింగ్ కథకు ఎంటర్టైన్మెంట్ జోడిస్తే... సినిమా అద్భుతంగా ఉంటుంది.  ఇలాంటి థ్రిల్లింగ్ కథతో వచ్చిన సినిమా 7. థ్రిల్లర్ ఎంటెర్టైన్మెట్న్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ లో కూడా సినిమాను తెరకెక్కించారట.  ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఇది ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. 

కథ: 

హవీష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.  తాను ప్రేమించిన అమ్మాయి నందిత శ్వేతాను వివాహం చేసుకుంటాడు.  కొన్నాళ్ళు లైఫ్ హ్యాపీగా సాగుతుంది. క్రమంగా ఆఫీస్ లో గొడవలు స్టార్ట్ అవుతాయి.  ఆ గొడవలు ఇంటివరకు రావడంతో... ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి.  కోపంతో హవీష్ ఇంటినుంచి వెళ్ళిపోతాడు.  కోపంతో బయటకు వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో శ్వేతా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ చేస్తుంది.  జరిగిన కథ చెప్తుండగా.. పోలీస్ అధికారి మధ్యలో ఆపి.. కథ చెప్పడం మొదలు పెడతాడు... ఈ కథ ఎలా తెలుసు అని అడిగితె ఆరు నెలల క్రితం అనిషా అంబ్రోస్ అనే మహిళ భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది.  చెన్నైలో మరో యువతి కూడా అలాగే కంప్లైట్ ఇచ్చింది అని చెప్తాడు.  

హవీష్ పై చీటింగ్ కేసు పెట్టగా... ఓ వ్యక్తి వచ్చి.. ఫొటోలో ఉన్నది హవీష్ కాదని అతని పేరు కృష్ణమూర్తి అని, అతను మరణించి చాలా కాలం అయ్యిందని చెప్పడంతో అందరు షాక్ అవుతారు.  ఆ తరువాత ఏం జరిగింది.. హవీష్ ఎవరు... వీరిని హవీష్ నిజంగానే మోసం చేశాడా అన్నది కథ.  

విశ్లేషణ: 

సినిమా ఓపెనింగ్ నుంచి ఎండ్ కార్డు వరకు థ్రిల్లింగ్ గా ఉండే విధంగా సినిమాను ప్లాన్ చేసుకోవాలి.  అలా ప్లాన్ చేసుకుంటేనే థ్రిల్లింగ్ గాఉంటుంది.  సినిమా నిలబడుతుంది.   7 విషయంలో ఇది లోపించింది.  ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా సాగినా సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్ లతో నడిపించారు.  ట్విస్ట్ లు బాగున్నా కథ నడిచిన తీరు పెద్దగా ఆకట్టుకోలేదు.  ట్విస్ట్ లు సినిమాకు ప్లస్ అయ్యాయి.  ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ సఫలం కాలేదనే పగతో ఏం చేసింది అన్నదే స్టోరీ.  దాని చుట్టూనే కథ నడిచింది. రెజీనాకు సంబంధించిన అంశాలు వచ్చినపుడు థ్రిల్లింగ్ అనిపిస్తుంది.  క్లైమాక్స్ వరకు బాగా తీసుకొచ్చిన సినిమా క్లైమాక్స్ కు వచ్చాక కామెడీగా మారిపోవడంతో సినిమా తేలిపోయింది.  

నటీనటుల పనితీరు: 

రెజీనా పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది.  ప్రేమ కోసం పరితపించే పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంది.  భావోద్వేగాలు, హావభావాలు సినిమాకు ప్లస్ అయ్యింది.  హవీష్ నటన చాలా వరకు మెరుగుపడింది.  మిగతా పాత్రలు చేసిన హీరోయిన్లు పర్వాలేదనిపించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారి తీసిన సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించాడు. సినిమాటోగ్రాఫర్ గా మెప్పించిన నిజార్ షఫీ, దర్శకుడిగా మెప్పించలేకపోయాడు.  రమేష్ వర్మ కథ బాగుంది.  మ్యూజిక్ పర్వాలేదనిపించింది.  

పాజిటివ్ పాయింట్స్: 

స్టోరీ 

సినిమాటోగ్రఫీ 

సాంగ్స్ 

నటీనటులు 

మైనస్ పాయింట్స్: 

ఫస్ట్ హాఫ్ 

చివరిగా : థ్రిల్లింగ్ జానర్లో ఆ థ్రిల్ మిస్సయింది..