ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి

ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు. మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్‌ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా గుర్తించారు. కాగా వీరందరూ అలండ్‌ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. అందులోబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడానికి వీరంతా కలబురగికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కలబురగి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.