గుడ్‌న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే క‌రోనా టీకా..

గుడ్‌న్యూస్‌.. త‌క్కువ ధ‌ర‌కే క‌రోనా టీకా..

క‌రోనా క‌ట్ట‌డి కోసం మందులు, వ్యాక్సిన్ తెచ్చేందుకు  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.. కొన్ని ఇప్ప‌టికే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి.. భార‌త్‌లో కూడా చాలా సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్ తెచ్చేందుకు పోటీ ప‌డుతున్నాయి.. ఈ స‌మ‌యంలో మ‌న దేశానికి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ గుడ్‌న్యూస్ చెప్పింది.. కేవ‌లం రూ.225కే క‌రోనా వ్యాక్సిన్ అందిస్తామ‌ని వెల్ల‌డించింది.. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ సహకారంతో క‌రోనా వ్యాక్సిన్ క‌ల‌ను సాకారం చేస్తోంది సీరం.. దీనికి సంబంధించిన ఒప్పందాలు ఇప్ప‌టికే జ‌రిగిపోగా.. తద్వారా 92 దేశాలకు ప్రయోజనం చేకూర‌నుంది. సీరం తెస్తున్న క‌రోనా వ్యాక్సిన్ డోసుకు రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. 

తాజాగా కుదిరిన ఒప్పందంతో  వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుంచి పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాకు 150 మిలియన్ డాలర్ల నిధులు అంద‌నున్నాయి.. కోట్ల‌ది మంది భారతీయుల‌కు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సీరం ఇప్పటికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. స్వ‌దేశంతో పాటు ఇత‌ర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేయ‌నుంది సీరం.. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర గరిష్టంగా సుమారు రూ.225గా ఉంటుందని తెలిపింది. 2021 చివరి నాటికి కోట్లాది వ్యాక్సిన్లను అందించాలనేది త‌మ టార్గెట్ అంటోంది. ఇత‌ర  సంస్థ‌ల క‌రోనా వ్యాక్సిన్ల‌తో పోలిస్తే.. సీరం తెచ్చే వ్యాక్సినే అంద‌రికీ అందుబాటు ధ‌ర‌లో ఉంటుంది అంటున్నారు నిపుణులు.