డిసెంబర్ లోనే సంచలన కేసులు... 

డిసెంబర్ లోనే సంచలన కేసులు... 

డిసెంబర్ నెలలోనే ఎక్కువగా సంచలనాలు జరుగుతున్నాయి.  ప్రతి ఏడాది డిసెంబర్ వస్తుంది అంటే ఏదొక సంచలన కేసులు ఉంటూనే ఉన్నాయి.  1992 డిసెంబర్ 6 వ తేదీన బాబ్రీ మసీద్ కేసు... ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చేసింది. అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.  అదే విధంగా 2012 డిసెంబర్ 16 వ తేదీన ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది.  ఈ కేసులో నిందితులను పట్టుకొని జైలుకు పంపించారు.  

నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేశారు.  ఈనెలలోనే వారిని ఉరితీసే అవకాశం ఉన్నది.  అదే విధంగా 2007 డిసెంబర్ 27 వ తేదీన విజయవాడలో అయేషాను హత్య చేశారు.  ఈ కేసులో సత్యం అనే ఓ నిరపరాధిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.  పాపం తొమ్మిదేళ్లు జైల్లో ఉన్న సత్యం నిరపరాధిగా బయటకు వచ్చారు.  ఇప్పుడు ఈ కేసును సీబీఐ అధికారులు టేకప్ చేస్తున్నారు.  దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు రాజకీయనాయకులు ఆందోళన చెందుతున్నారు.  ఇక ఇదిలా ఉంటె, దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసింది కూడా ఈనెలలోనే కావడం విశేషం.  ఎన్నో సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ వస్తున్న పౌరసత్వం బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో చట్టం అయ్యింది.  దీనిపై ప్రస్తతం ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.  బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలను తిరిగి వారిదేశానికి పంపించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది.  ఇదే ఇప్పుడు ఆందోళనకు దారితీసేలా చేసింది.