తెలకపల్లి రవి: రామచంద్రమూర్తి రాజీనామా వ్యక్తిగతమే..!

తెలకపల్లి రవి: రామచంద్రమూర్తి రాజీనామా వ్యక్తిగతమే..!

తెలకపల్లి రవి

ఏపీ ప్రభుత్వ ప్రజా విధాన సహాదారులు సీనియర్‌ సంపాదకులు  కె.రామచంద్రమూర్తి రాజీనామాపై కొన్ని మీడియా సంస్థల్లో రకరకాల  కథనాలు వస్తున్నాయి.  తెలుగులో ఈ తరంలోని  చాలా పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించిన మూర్తి హెచ్‌ఎంటివితో పాటు హన్స్‌ ఇండియా ఇంగ్లీషుపత్రిక వ్యవస్థాపక సంపాదకుడుగానూ వున్నారు.  విద్యుచ్చక్తి సమస్యనూ  ప్రజారోగ్యాన్ని ఆయన ప్రత్యేకాసక్తితో అధ్యయనం చేసి కొంత కృషి జరిపారు. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా ఈ సంపాదక ప్రస్తానం ముగించారు. తర్వాతనే జగన్‌ ప్రభుత్వ సలహాదారుడుగా గత సెప్టెంబరులో పదవీ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం తర్వాత తనతో కసి పనిచేసిన మూర్తికి   గౌరవపూర్వకంగా సలహాదారు బాధ్యతలు అప్పగించారు. దానిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. సహజంగానే ఇంతమంది సలహాదారులకు బాధ్యత విభజన నిరంతర పనులు అప్పగింత జరిగేపని కాదు. పైగా సంక్షేమ పథకాల ప్రణాళికనే ప్రధానంగా భావించే జగన్‌ చిన్న చిన్న అంశాలను అంతగా పట్టించుకోవడం, ప్రతిసారి సంప్రదించడం వుండదని అందరికీ తెలుసు.  అయితే జగన్‌ ప్రభుత్వ రాజకీయ విధానాలకు సంబంధించిన చాలా అంశాలలో విమర్శలకు ఈ సహాదారుపై ఎక్కుపెట్టడం చాలాసార్లు జరిగింది. ఈ పదవిలో  దాదాపు ఏడాది పాటు కొనసాగిన రామచంద్రమూర్తి ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు తప్ప రాజకీయ కారణాలు ఉన్నట్టు కనిపించదు. సుహృద్బావంతోనే సెలవు తీసుకోవడం తప్ప ఇందులో వివాదాలు విమర్శలు  లేవని ఆయన అన్నారు. రాజీనామా తర్వాత  కొందరు నేతలు  తనను అభినందించినట్టు చెప్పడం కూడా మూరిక్తి సుముఖంగా అనిపించలేదట. బహుశా ఆయన మరోసారి మీడియా రంగంలోనే కృషి చేసే అవకాశాలు ఉండవచ్చు.