ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌.. ఉత్తర్వులు జారీ

ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్పీ ఠాకూర్‌ను నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏపీ డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా నియమించింది వైసీపీ సర్కార్.. ప్రస్తుతం ఠాకూర్‌.. ఏపీ ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్నారు.. టీడీపీ సర్కార్‌ హయాంలో డీజేపీగా పనిచేశారు ఠాకూర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్ వచ్చిన తర్వాత.. డీజీపీగా ఉన్న ఠాకూర్‌ను ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా నియమించింది వైసీపీ ప్రభుత్వం.