"యుగానికి ఒక్కడు" సీక్వెల్ రానుందా..?

"యుగానికి ఒక్కడు" సీక్వెల్ రానుందా..?

తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ మంచి విజయాలను సాధిస్తున్నాయి. తమిళ్ తో పాటు తెలుగులో కూడా కార్తీకి మంచి మార్కెట్ వుంది. అయితే కార్తీ ఫస్ట్ హిట్ అందుకున్న సినిమా యుగానికి ఒక్కడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సీక్వెల్స్ చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి.యుగానికి ఒక్కడు సినిమాలో చోళులు పాండ్యులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఒక కొత్త ఫీల్ ని కలిగిస్తాయి.తెలుగులో యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ అవ్వగానే సాలీడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. హిస్టారికల్ మూవీ అంటూ పాజిటివ్ కామెంట్స్ రావడంతో 2010లో బెస్ట్ హిట్స్ లో ఈ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. ఇక ఈ సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నారు. . చోళరాజుల నేపథ్యంలో సాగే కథను మరోమారు రూపొందించాలనే ఆసక్తి తనలో అలాగే ఉందంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సెల్వరాఘవన్.