శేఖర్ కమ్ముల 'ఫిదా' తొలి ఛాయిస్ ఎవరంటే....

శేఖర్ కమ్ముల 'ఫిదా' తొలి ఛాయిస్ ఎవరంటే....

శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లవ్ స్టోరీ' ఈ నెల 16న జనం ముందుకు రాబోతోంది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ మూవీ విడుదల సందర్భంగా శేఖర్ కమ్ముల ప్రమోషనల్ యాక్టివిటీస్ లో జోరుగా పాల్గొంటున్నాడు. అందులో భాగంగా కొన్ని పాత సంఘటనలనూ శేఖర్ కమ్ముల తలచుకున్నాడు. వరుణ్ తేజ్ నటించిన 'ఫిదా' సినిమాను తొలుత మహేశ్ బాబు లేదా రామ్ చరణ్ తో తీయాలనుకున్నానని శేఖర్ కమ్ముల తెలిపాడు. నిజానికి మొదటి నుండి శేఖర్ కమ్ముల తన సినిమాలను స్టార్స్ తో చేయాలనే భావిస్తున్నాడు. కానీ రకరకాల కారణాల వల్ల అవి వేరే వాళ్ళతో తీయాల్సిన పరిస్థితి వస్తోంది.

'డాలర్ డ్రీమ్స్'తో దర్శకుడిగా మారిన శేఖర్ కమ్ములకు పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం రాజా, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన 'ఆనంద్'. మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' విడుదల రోజునే 'ఆనంద్' రిలీజ్ కావడం... ఆ సినిమాతో పాటు ఇదీ చక్కని విజయాన్ని అందుకోవడం మర్చిపోలేని విషయం అంటున్నాడు శేఖర్ కమ్ముల. అలానే రానా హీరోగా పరిచయమైన 'లీడర్' సినిమాకు శేఖర్ కమ్ముల సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టుగానూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. పొలిటికల్ డ్రామా అయిన 'లీడర్ -2' కథను మహేశ్ బాబుకు శేఖర్ కమ్ముల త్వరలో వినిపించబోతున్నాడంటూ గుసగుసలు వినిపించాయి. మరి శేఖర్ కమ్ముల వర్కింగ్ స్టైల్ ను ఇష్టపడే స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో అతనితో మూవీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.