నీ ఇంట్లోకొచ్చి మరి కొడతాం, ఇది న్యూ ఇండియా : సెహ్వాగ్

నీ ఇంట్లోకొచ్చి మరి కొడతాం, ఇది న్యూ ఇండియా : సెహ్వాగ్

భారత్-ఆసీస్ మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను టీం ఇండియా 2-1 తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో గబ్బా వేదికగా జరిగిన చివరి మ్యాచ్ చివరి రోజు ఆట చాలా ఉత్కంఠంగా సాగింది. ఆ ఒక్క రోజు భారత ఆటగాళ్లు ముగ్గురు రెచ్చిపోవడంతో 325 పరుగులు సాధించి విజయం అందుకుంది. దాంతో భారత మాజీ ఆటగాళ్లు అలాగే ఇతర ఆటగాళ్లు కూడా జట్టు పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ విజయం పై తనదైన రీతిలో స్పందించాడు. ఇది న్యూ ఇండియా, నీ ఇంట్లోకొచ్చి మరి కొడతారు... అడిలైడ్ టెస్ట్ నుండి ఇప్పటివరకు యువ ఆటగాళ్లు జీవితాంతం గుర్తిండిపోయే సంతోషాన్ని ఇచ్చారు అని సెహ్వాగ్ ట్విట్ చేసారు. అయితే చివరి రోజు ఆటగాలి యువ ఆటగాళ్లు గిల్(91), పంత్(89) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.