ఉగాదికి గురిపెట్టిన సీటీమార్

ఉగాదికి గురిపెట్టిన సీటీమార్

తెలుగు స్టార్ హీరోల్లో గోపీచంద్ కూడా ఒకడు. ఎగ్రెసివ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ హీరో గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక వెనకబడ్డాడు. ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న తాజా చిత్రం సీటీమార్. ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వం చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో చేస్తోంది. ఇక హీరోయిన్ విషయానికొస్తే దిగంగన సూర్యవంశీ ఇందులో చేస్తోంది. ఇందులో గోపీచంద్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. చిత్రంలో హీరో ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తున్నాడు. అదే తరహాలో మిల్కీ బ్యూటీ తమన్నా తెలంగాణ టీం కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే లవ్ కం రివేంజ్ డ్రామాగా సినిమా నడుస్తుందని అంటున్నారు. మంచి హిట్ కోసం చూస్తున్న గోపీచంద్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని తెలిసింది. అయితే ఈ సినిమా ఈ దసరాకు వచ్చేందుకు చూస్తుందట. ఈ సారి గురి తప్పదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి గోపి వాటిని అందుకుంటాడో లేదో చూడాలి.