భూమా అఖిలప్రియ పిటిషన్‌ కొట్టివేత..

భూమా అఖిలప్రియ పిటిషన్‌ కొట్టివేత..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే రిమాండ్‌ రిపోర్టులోని కీలక అంశాలు బయటకురాగా... ఈ కేసులో ఏ-1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసుకున్న పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది... బెయిల్‌ పిటిషన్‌తో పాటు.. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు అఖిల ప్రియ.. అయితే, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడగా.. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.. జైలులో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని... అందుబాటులో వైద్యులు కూడా ఉన్నారని పేర్కొన్న కోర్టు.. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించాలని సూచిస్తే... అప్పుడు నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది. ఇక, రేపు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేపు పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుండగా... అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం రోజు వాదనలు కొనసాగనున్నాయి. 

ఇక, భూమా అఖిల ప్రియకు గైనిక్ ట్రీట్మెంట్ జరుగుతుందని ఇవాళ ఉదయమే కోర్టుకు తెలిపారు ఆమె తరఫున న్యాయవాదులు.. అక్టోబర్ నుండి pcod చికిత్స పొందుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అఖిల ప్రియ గర్భం దాల్చినట్టు హెల్త్ రిపోర్ట్స్ ను కూడా కోర్టుకు ఇచ్చారు న్యాయవాదులు.. ఇదే సమయంలో అఖిల ప్రియ హెల్త్ కండిషన్‌కు సంబంధించిన రిపోర్టులను కోర్టుకు అందజేశారు పోలీసులు.. అయితే, జైలులో సరైన సదుపాయాలు లేవని... మెరుగైన వైద్యం అవసరం అని కోర్టుకు తెలిపారు అఖిల ప్రియ న్యాయవాదులు.. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కు అనుమతి ఇవ్వాలని కోరారు.. దీనిపై ఇరు వర్గాల వాదనలు  ఉదయం విన్న కోర్టు.. అఖిల ప్రియ ఆరోగ్యానికి సంబంధించిన పిటిషన్‌పై సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది.