దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు..!

దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు..!

భారత దేశానికి సెక్యులరిజమే అతిపెద్ద ముప్పు అంటూ కామెంట్ చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్... కొందరు డబ్బుల కోసం దేశం గురించి తప్పుడు వ్యాఖ్యాలను చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం యోగి.. కొన్ని స్వార్థ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. వారు దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్లు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్.