పోలీసుల రైడ్స్ లో దొరక్కుండా సీక్రెట్ హోటల్ రూమ్స్...

పోలీసుల రైడ్స్ లో దొరక్కుండా సీక్రెట్ హోటల్ రూమ్స్...

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓయో రూమ్స్‌లో యువతిపై యువకుల అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది.  స్నేహం పేరుతో ఓ డిగ్రీ విద్యార్థినిని నమ్మించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్‌డే వేడుకలు చేసుకుందామంటూ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లిన యువకులు జోసెఫ్‌, రాము, నవీన్‌ కేక్‌ లో మత్తు మందు కలిపి ఇచ్చారు. అది తిన్న యువతి వెంటనే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ యువకులు... విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బర్త్‌ డే ఉందని బయటికి వెళ్లిన కూతురు ఇంటికి వచ్చాక అనారోగ్యంతో ఉన్నట్లు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.

అసలు ఏం జరిగిందని తల్లిదండ్రులు నిలదీయడంతో యువతి జరిగిన ఘోరాన్ని వివరించింది. ముగ్గురు యువకులు చేసిన అకృత్యంపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక  మరో వైపు యువతీ యువకులకు ఓయో రూమ్స్‌ యజమానులు యథేచ్ఛగా గదులు ఇస్తూ అసాంఘిక కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే... యువతిపై అత్యాచారం జరిగిన హోటల్లో రహస్య గదులు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎవరైనా వచ్చినా అవి కంటపడకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. యువతిపై అఘాయిత్యం జరిగిన ఓయో రూమ్స్‌ నుంచి మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.