కరోనా సెకండ్ వేవ్: అత్యంత ప్రమాదకారిగా మారుతుందా?

కరోనా సెకండ్ వేవ్: అత్యంత ప్రమాదకారిగా మారుతుందా?

ప్రపంచంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.  ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాల్లో ఈ కరోనా తీవ్రత పెరిగిపోతున్నాయి.  చలిగాలులు పెరగడంతో వైరస్ విజృంభిస్తోంది.  నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 5,70,993 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  8889 కరోనా మరణాలు సంభవించాయి.  అమెరికాలో నిన్న ఒక్కరోజులో 1.60 లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగితోంది.  అమెరికా ఎన్నికల తరువాత అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవున్నాయి.  ప్రతిరోజూ లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  ఇది ఆందోళన కలిగించే అంశమే.  రెండో దశ కరోనా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రాబోయే రోజుల్లో వైరస్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.