'వివాహ భోజనంబు' రెండో పాట 'వాట్ ఏ మ్యాన్...' విడుదల

'వివాహ భోజనంబు' రెండో పాట 'వాట్ ఏ మ్యాన్...' విడుదల

కమెడియన్ సత్య హీరోగా వస్తున్న తొలి సినిమా 'వివాహ భోజనంబు'. ఆనంది ఆర్ట్స్,  సందీప్ కిషన్ నిర్మించిన చిత్రమిది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా నుంచి 'వాట్ ఏ మ్యాన్' అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. ఇది ఈ చిత్రం నుంచి విడుదలైన రెండో పాట. అనిరుద్ విజయ్ సంగీతం అందించిన 'వాట్ ఏ మ్యాన్...' పాటను సమ్రాట్ రాశారు. 'చౌరస్తా' రామ్ ఈ పాట పాడారు. ఇది సినిమాలో హీరో బిల్డప్ సాంగ్ గా వస్తుంది. ఇప్పటికే తొలి పాట 'ఎబిసిడి...' కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రెండో పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందంటున్నారు మేకర్స్. లాక్‌డౌన్ లో జరిగిన వాస్తవ సంఘటనల సమహారంగా రూపొందిన చిత్రం ఇది. పరమ పిసినారి మహేష్ (సత్య). కరోనాతో లాక్‌డౌన్ లో 30మందితో సింపుల్‌గా  పెళ్లి చేసుకుంటాడు. ఆ తరవాత  లాక్‌డౌన్ కొనసాగడంతో అతగాడు ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఈ సినిమా కథాంశం. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.