వుహాన్ తరహాలో భయపెడుతున్న బీజింగ్ మార్కెట్... దానికి సంకేతమా? 

వుహాన్ తరహాలో భయపెడుతున్న బీజింగ్ మార్కెట్... దానికి సంకేతమా? 

కరోనా వైరస్ కు పుట్టినిల్లు చైనా.  చైనాలోని వుహాన్ నగరంలో వైరస్ పుట్టింది. అయితే, ఈ వైరస్ వుహాన్ లోని వెట్  మార్కెట్ నుంచి వ్ ఇస్తారంగా విస్తరించింది.  దీంతో వుహాన్ నగరాన్ని  70 రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ చేసి కరోనాను చాలా వరకు కట్టడి  చేశారు.  అయితే, కరోనా వ్యాప్తిని గుర్తించడంలో ఆలస్యం చేయడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  

చైనాతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాలకు కరోనా మెల్లిగా విస్తరించింది.  యూరప్, అమెరికా ఇప్పుడు ఇండియా ఈ వైరస్ వలన ఇబ్బందులు పడుతున్నాయి.  ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే వస్తుంది అన్నట్టుగా, వైరస్ చైనాలో మొదలయ్యి ఇప్పుడు తిరిగి చైనాకు చేరింది.  

చైనాలో కేసులు పెరిగిపోతుండటమే ఇందుకు ఉదాహరణ.  అయితే, ఈసారి వైరస్ రూట్ మార్చి బీజింగ్ పై దాడి చేస్తున్నది.  బీజింగ్ లోని జిన్ ఫాండి మార్కెట్ నుంచి కరోనా విస్తరణ చెందుతున్నది.  దీంతో బీజింగ్ లోని అనేక ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు.  ఒకేసారి తగ్గిపోయి మరలా కరోనా వ్యాపించడం మొదలుపెడితే దానిని కట్టడి చేయడం చాలా కష్టం అవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే పేర్కొన్నారు.  చెప్పినట్టుగానే రెండోదశ వ్యాప్తి మొదలయ్యిందేమో అనిపిస్తోంది.