ఏకగ్రీవాలపై ఎస్ఈసి ట్విస్ట్... 

ఏకగ్రీవాలపై ఎస్ఈసి ట్విస్ట్... 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  రాష్ట్రంలో తొలిద‌శ ఎన్నిక‌లు ఈనెల 9 వ తేదీన జ‌రుగుతున్నాయి.  అయితే, ఏకగ్రీవాల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇప్ప‌టికే ఓ క్లారిటీ ఇచ్చింది.  బ‌ల‌వంత‌పు ఏకగ్రీవాల‌పై నిఘా ఉంటుంద‌ని, అటువంటి వాటిని అంగీక‌రించ‌బోమ‌ని చెప్పింది.  ఇక‌, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏక‌గ్రీవ ఎన్నిక‌ల‌పై ఎస్ఈసీ ట్విస్ట్ ఇచ్చింది.  ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ ఏకగ్రీవాలు రావ‌డంతో ఎస్ఈసీ అనుమానం వ్య‌క్తం చేసింది.  ఏక‌గ్రీవాల‌పై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.  నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్ఈసి తెలిపింది.  గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏక‌గ్రీవాల‌ను ప్ర‌క‌టించొద్ద‌ని ఎస్ఈసీ పేర్కొన్న‌ది.  మొద‌టివిడ‌త‌లో చిత్తూరులో 110, గుంటూరులో 67 పంచాయితీలు ఏక‌గ్రీవం అయ్యాయి.  ఏక‌గ్రీవాల‌ను గుడ్డిగా ఆమోదించ‌బోమ‌ని ఇప్ప‌టికే ఎస్ఈసీ చెప్పిన సంగ‌తి తెలిసిందే.  మరి ఎస్ఈసీ నిర్ణ‌యంపై అధికార పార్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.