గవర్నర్‌తో భేటీకి సిద్ధమైన నిమ్మగడ్డ...

గవర్నర్‌తో భేటీకి సిద్ధమైన నిమ్మగడ్డ...

ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవహారం మరోసారి కాకరేపుతోంది... రేపు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గవర్నర్‌తో చర్చించనున్నారు నిమ్మగడ్డ. రేపు ఉదయం 11.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై ఆయనకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు కూడా ప్రారంభించనున్నారు నిమ్మగడ్డ... రేపు వివిధ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు... ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. కాగా, నిమ్మగడ్డ వ్యవహారశైలిపై అధికార వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధత లేకుండా ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.. నిమ్మగడ్డ వ్యవహారశైలి, టీడీపీకి కొమ్ముకాసేలా ఉందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.