మాక్స్వెల్ కు అంత ధర పెట్టడం అవివేకం...

మాక్స్వెల్ కు అంత ధర పెట్టడం అవివేకం...

ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కు రూ .10 కోట్లు చెలిస్తే అది అవివేకం అని న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ తెలిపారు. అయితే ఐపీఎల్ 2020 వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాక్స్వెల్ ను రూ .10.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో అతను తన స్థాయి తగ్గిన ప్రదర్శన చేయలేదు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 101.88 స్ట్రైక్ రేట్ తో మాక్స్వెల్ 108 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఈ ఏడాది వేలానికి అతడిని పంజాబ్ వదిలేసింది. అయితే గత "ఐదు లేదా ఆరు" ఐపీఎల్ సీజన్లలో మాక్స్వెల్ ప్రదర్శన నిరాశపరిచింది అని స్కాట్ స్టైరిస్ తెలిపారు. మాక్స్వెల్ ను వేలంలో ఏదో జట్టు తీసుకునే అవకాశం ఉంది అనే నేను అనుకుంటున్నాను. కానీ ఏవరు అతని అది బేస్ ప్రైస్ లోనే తీసుకోవాలని సూచించాడు. చూడాలి మరి ఈ ఏడాది వేలంలో ఏం జరుగుతుంది అనేది.