గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : 5వేల మొక్కలు నాటిన ఎస్సీ,ఎస్టీ కమిషన్...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : 5వేల మొక్కలు నాటిన ఎస్సీ,ఎస్టీ కమిషన్...

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వైఎం తాండ కొత్తూర్ మండలం ,రంగారెడ్డి జిల్లాలో  5000 మొక్కలను నాటడం జరిగింది. అనంతరం పౌరహక్కుల దినోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రాథమిక హక్కుల గురించి వివరించారు. ప్రాథమిక హక్కుల వినియోగం..వాటి అమలుపై వివరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ,అతిథులుగా స్థానిక ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్  ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్శన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిథులు హజరయ్యారు. 

అనంతరం మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో కమిషన్ కార్యాలయం ఐదు వేల మొక్కలను నాటడం అభినందనీయం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో దేశానికి ఆదర్శంగా రాష్ట్ర కమిషన్ నిలవడం గర్వకారణం. ఇదే విధంగా కమిషన్ పని చేసి ఆయా వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

 సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ పని తీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.ఇతర రాష్ట్రాలు మన కమిషన్ ను ఆదర్శంగా తీసుకుని పని చేయడం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,సభ్యుల,అధికారుల పనితీరుకు నిదర్శనం.అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుంది.ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తుంది. కమిషన్ ఇంతటి మహోత్తర కార్యానికి పూనుకోవడం అభినందనీయం అని అన్నారు.

అనంతరం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశంలో అంతరించిపోతున్న అడవులను పునరిద్దంచడానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఐదు వేల మొక్కలను నాటడం చాలా సంతోషంగా ఉంది. అన్ని అంశాల్లో కమిషన్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో ఆకుపచ్చని బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతుగా ఈ మహోత్తర కార్యానికి శ్రీకారం చుట్టాం. భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను,ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో కమిషన్ పని చేస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కమిషన్ హైదరాబాద్ గల్లీ నుండి రాష్ట్రంలోని ప్రతి గల్లీకి చేరేలా ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికై కృషి చేస్తున్నాం.రాష్ట్రంలో అన్ని శాఖలపై సమీక్ష చేసే అధికారం ఉంది కాబట్టి ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరగక్కుండా పని చేసే బాధ్యత ఉంది. 

అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం ఉండకూడదు. ..మొత్తం 10 వేల ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులగానూ 8వేల కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడం అభినందనీయం. బాధితులకు రూ.52కోట్ల 50లక్షలను పరిహారం అందించిన కమిషన్ గా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ నిలిచింది.పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ఏకైక కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్. అన్ని వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అందరికి అవగాహన ఉండాలని సూచించారు. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు. యావత్ ప్రపంచం అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుస్తుంది. పౌరహాక్కుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెల ముప్పై తారీఖున కమిషన్ నిర్వహిస్తుంది.ఆయా వర్గాలకు పౌరహక్కులపై అవగాహన కల్పించడమే దీనియొక్క ఉద్ధేశ్యం.పౌరుల హక్కులకు భంగం కలగకుండా అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.