ట్రాక్టర్ ర్యాలీ పోలీసుల చేతిలోనే...తేల్చేసిన సుప్రీం !

ట్రాక్టర్ ర్యాలీ పోలీసుల చేతిలోనే...తేల్చేసిన సుప్రీం !

జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతు నిరసనలు, ట్రాక్టర్‌ ర్యాలీపై కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయగా.. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పోలీసుల పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని సుప్రీం తెలిపింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ వెనక్కి తీసుకోవాలని చెప్పింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయ స్థానం నియమించిన నిపుణుల కమిటీ నుంచి ఒకరు తప్పుకోవడంతో కమిటీ పునర్నియామకంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక కొద్ది సేపటి క్రితమే రైతులతో కేంద్ర మంత్రులు చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు చర్చలలో ఏమయినా సయోధ్య వస్తే ఈ నిరసన ప్రదర్శనలు ఆగే అవకాశం ఉంటుంది.