ఖాతాదారుల‌కు ఎస్బీఐ వార్నింగ్.. వారికి మాత్ర‌మే..!

ఖాతాదారుల‌కు ఎస్బీఐ వార్నింగ్.. వారికి మాత్ర‌మే..!

ప్ర‌భుత్వరంగ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గ‌జం ఎస్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. అయితే, ఇది కేవ‌లం కేవైసీ అప్‌డేడ్ విష‌యం మాత్ర‌మే.. గడువు ముగిసేలోగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది ఎస్బీఐ.. ఖాతాదారులు ఈ నెల 31వ తేదీలోగా కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని ఆదేశించింది.. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన ఎస్బీఐ.. లేనిపక్షంలో సంబంధిత ఖాతాల‌ను నిలిపివేయ‌నున్న‌ట్టు స్పష్టం చేసింది. కేవైసీ విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక వార్నింగ్ ఇచ్చింది ఎస్బీఐ.. సంబంధిత ఖాతా ఉన్న బ్రాంచ్‌ల్లోని కానీ లేదా దగ్గరలోని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్‌లో గానీ..  కేవైసీ డాక్యుమెంట్లను వెంట‌నే అందించాల‌ని ఆదేశించింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కేవైసీ అప్‌డేట్ చేయ‌ని ఖాతాదారులు త్వ‌ర‌ప‌డ‌డండి.. వెంట‌నే ఈ నెల‌లోనే అప్‌డేట్ చేయండి.. లేక‌పోతే.. ఖాతా నిలిచిపోవ‌డం ఖాయం అన్న‌మాట‌.