గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ...

గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ...

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా( ఎస్బీఐ) మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఇప్పటికే పలు దఫాలుగా హౌసింగ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఎస్బీఐ... పండగకు ముందే మరోసారి తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది మార్చి వరకు గృహ రుణాలపై 30 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. అంతేకాదు అప్పటి వరకు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఎస్బీఐ.. అయితే, ఈ వడ్డీ రాయితీ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రూ.5 కోట్ల వరకు ఉండే గృహ రుణాలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది... ఖాతాదారుల వ్యక్తిగత సిబిల్‌ స్కోర్ ఆధారంగా ఈ రాయితీ వర్తింపజేస్తారు.. ఇక, రూ.30 లక్షల వరకు ఉండే హౌసింగ్ లోన్స్‌పై 6.80 శాతం వడ్డీ, అంతకు మించిన రుణాలపై 6.95 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్టు ప్రకటించింది ఎస్బీఐ.. అంతేకాదు.. మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ లభించనుండగా..  యోనో యాప్‌ ద్వారా అప్లై చేసుకున్నవారికి అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు.. ఇక, ఇప్పటికే ఎస్బీఐ నుంచి హోమ్‌ లోన్లు తీసుకున్న ఖాతాదారులు యోనో యాప్‌ ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ టాప్‌ అప్‌ హోమ్‌ లోన్లు పొందవచ్చు అంటున్నారు అధికారులు. మొత్తంగా.. పండగ ముందు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్బీఐ.