లాక్‌డౌన్‌ 4.0.. ఎస్బీఐ కీలక నిర్ణయం..!

లాక్‌డౌన్‌ 4.0.. ఎస్బీఐ కీలక నిర్ణయం..!

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది.. చాలా వరకు మినహాయింపులు ఇచ్చినా.. పూర్తిస్థాయిలో అన్నీ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టనుంది.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0 మే 31 వరకూ పొడిగించడంతో.. అదే విధంగా మారటోరియాన్ని కూడా ఆర్‌బీఐ మూడు నెలలు పొడిగిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). బ్యాంకు రుణాలపై మరో మూడు నెలల పాటు మారటోరియం విధించే ప్రతిపాదనను ఆర్‌బీఐ ఇప్పటికే పరిశీలిస్తోందని వార్తలు రావడంతో.. తాజాగా ఎస్‌బీఐ ఈ ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యక్తుల, సంస్థల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే వారు రుణ చెల్లింపులు జరిపే పరిస్థితి లేదు. ఈ కారణాల వల్లే రుణాలపై మరో మూడు నెలలపాటు మారటోరియం విధిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది ఎస్బీఐ. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సి) సహా అన్ని రుణ సంస్థలను తమ రుణగ్రహీతలకు టర్మ్ లోన్‌లపై మూడు నెలల తాత్కాలిక మారటోరియాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐని కోరింది.. కాగా, ఆర్బీఐ ప్రకారం.. తాత్కాలిక నిషేధం కింద వాయిదాపడిన వాయిదాలలో మార్చి 1, 2020 నుండి మే 31, 2020 వరకు ఉంది.. దీంతో.. వడ్డీ చెల్లింపులు, నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు తదితరాలు చెల్లించకుండా వెసులుబాటు కల్పించారు.. అయితే.. ఇప్పుడు లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినా వెంటనే చెల్లించే శక్తి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మూడు నెలల మారటోరియాన్ని ఎంచుకోవాలనుకుంటే మాత్రం.. దానిపై బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని.. లేనిపక్షంలో మీ ఖాతాలో డబ్బు ఉంటే డెబిట్ అవుతూనే ఉంటుందని చెబుతున్నారు ఎస్బీఐ అధికారులు.