షాకిచ్చిన ఎస్బీఐ.. కోత పెట్టేసింది..

షాకిచ్చిన ఎస్బీఐ.. కోత పెట్టేసింది..

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తమ కస్టమర్లకు ఓ రకంగా షాకిచ్చే న్యూస్ చెప్పింది.. పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు కోతపెట్టింది.. సవరించిన వడ్డీ రేట్లను 2020 మే 31 నుండి అమల్లోకి వచ్చేసినట్టు ప్రకటించింది. ఇకపై.. రూ .1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న ఎస్‌బీఐ సేవింగ్ డిపాజిట్ల ఖాతాదారులు 2.7 శాతం వడ్డీని పొందుతారు.. ఇప్పటి వరకు ఇది 2.75 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో... వడ్డీ రేటు కాస్త 2.7 శాతానికి పరిమితం కానుంది. దీని ప్రభావం దాదాపు 44 కోట్ల మంది బ్యాంక్ ఖాతాదారులపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.. కాగా, ఏప్రిల్‌లోనూ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది ఎస్‌బీఐ.. దీంతో.. అప్పుడు వడ్డీ రేటు 2.75 శాతానికి దిగొచ్చింది. ఇప్పుడు అదికాస్త 2.7 శాతానికి పడిపోయింది.