శాక్సాఫోన్‌ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్ వర్ధంతి

శాక్సాఫోన్‌ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్ వర్ధంతి

శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన ప్రముఖ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్. నేడు ఆయన వర్థంతి . స్వదేశంలోనే కాకుండా యూరప్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమాసియా దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చి అక్కడి సంగీత ప్రియుల నీరాజనాలందుకున్నారు కదిరి గోపాలనాథ్. డిసెంబర్ 6, 1949 న దక్షిణా కన్నడలోని బంట్వాల్ తాలూకాలోని సజీపా మూడ గ్రామంలోని మిట్టకేరేలో గోపాల్‌నాథ్ జన్మించారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్లో కచేరీ చేసిన అతికొద్దిమంది కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఈయన ఒకరు. గోపాలనాథ్ చిన్న వయస్సులోనే నాగస్వరాన్ని తన తండ్రి నుండి నేర్చుకున్నాడు.చిన్న వయస్సులో గోపాల్నాథ్ కు అప్పటి మైసూర్ ప్యాలెస్ యొక్క బ్యాండ్ లో సాక్సోఫోన్ నేర్చుకునే అవకాశం పొందారు. తరువాత ఆ వాయిద్యం మీద ఇష్టాన్ని పెంచుకుంటూ,కళానికేతన్‌కు చెందిన ఎన్. గోపాలకృష్ణ అయ్యర్ నుండి సాక్సోఫోన్‌లో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాడు. గోపాలనాథ్ తన మొదటి సంగీత కచేరీని 1978 లో మంగళూరులోని ఆల్ ఇండియా రేడియోలో ప్రదర్శించాడు.మంగళూరు, బెంగళూరు విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి.