వకీల్ సాబ్ ‘సత్యమేవ జయతే’ వచ్చేసింది.

వకీల్ సాబ్ ‘సత్యమేవ జయతే’ వచ్చేసింది.

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్ తొలిసారిగా లాయర్ పాత్ర చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ మార్పులు చేశారు. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ రెండో పాటను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ‘మగువా.. మగువా’ పాట అభిమానాలను అలరించగా.. తాజాగా విడుదలైన ‘సత్యమేవ జయతే’ పాట ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న థియేటర్లోకి రానుంది.