అంతరిక్షం నుంచి అరుదైన దృశ్యం... వైరల్ 

అంతరిక్షం నుంచి అరుదైన దృశ్యం... వైరల్ 

ఇరాన్... ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని హెరాత్ నగరంలో ఫిబ్రవరి 13 వ తేదీన బ్లాస్టింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  ఈ బ్లాస్టింగ్ లో 500 లకు పైగా ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లతో నిండిన ట్రక్కులు కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.  దీంతో ఇరాన్ నుంచి ఆఫ్గనిస్తాన్ వరకు పవర్ సప్లై ని నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.  ఫిబ్రవరి 13 వ తేదీన జరిగిన ఈ బ్లాస్టింగ్ కు సంబంధించిన దృశ్యాలను అంతరిక్షం నుంచి మక్సర్ కు చెందిన వరల్డ్ వ్యూ 3 శాటిలైట్ హైరెజల్యూషన్ ఫోటోలను తీసింది.  ఈ ఫొటోల్లో పూర్తిగా దగ్దమైన ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కులు కనిపిస్తున్నాయి.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఇక పేలుళ్లు జరిగిన సమయంలో హెరాత్ నగరంలో విద్యుత్ నిలిపివేశారు.  దీంతో నగరం మొత్తం అంధకారంగా మారిపోయింది.  ఈ పేలుడు కారణంగా దాదాపుగా 5 కోట్ల డాలర్ల నష్టం సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు.