ప్రారంభమైన 'సర్కారు వారి పాట'...

ప్రారంభమైన 'సర్కారు వారి పాట'...

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట' మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కనుంది. నవంబర్ 21న 4th KPHB  కాలనీ లోని కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో 11:43 కి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్  చేశారు. ముహూర్తం షాట్ ని  కాశీ విశ్వనాధ స్వామి టెంపుల్ లో తీశారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితర పాత్రలో నటించనున్నారు.