ఇంగ్లాండ్-పాకిస్థాన్ టెస్ట్ లో డ్రింక్స్ వివాదం...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ టెస్ట్ లో డ్రింక్స్ వివాదం...

మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో నిన్న జరిగిన ఆటలో ఓ డ్రింక్స్ వివాదం ఇప్పుడు చెలరేగుతుంది. అదేంటంటే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్ మధ్యలో వాటర్ బాయ్ గా మరి ఆటగాళ్లకు వాటర్ అందించాడు. ఇక ఈ విషయం పై పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతమంది జూనియర్ ఆటగాళ్లు ఉండగా మాజీ కెప్టెన్ తో ఇలాంటి పనులు చేయించడం ఏంటి అంటున్నారు. అయితే ఈ విషయం పై భారత అభిమానులు పంచులు వేస్తున్నారు. ఇంతక ముందు కోహ్లీ, ధోని వాటర్ అందించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ సర్ఫరాజ్ వీరికంటే గొప్పవాడా అని ప్రశ్నింస్తున్నారు. కేవలం ధోని, కోహ్లీ మాత్రమే కాకుండా విలియమ్సన్, రికీ పాంటింగ్ ఇలా చాల మంది స్టార్ ఆటగాళ్లు వారు కెప్టెన్లగా ఉన్నపుడే వాటర్ అందించారు. ఈ వివాదం పై పాకిస్థాన్ చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ స్పందించాడు. ‘‘క్రికెటర్ డ్రింక్స్ మోయడం చాలా సాధారణ విషయం. అది సర్ఫరాజ్‌ కూడా తెలుసు. ఆస్ట్రేలియాతో సిరీస్ సమయంలో నేను కెప్టెన్‌గా ఉన్నపుడు కూడా ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాను’’ అని హక్ తెలిపాడు.