వారికి తెలియకుండా అల్మారాలో నా భార్యను... 

వారికి తెలియకుండా అల్మారాలో నా భార్యను... 

పాకిస్థాన్ స్పిన్ దిగ్గజం సక్లైన్ ముష్తాక్ తన బౌలింగ్ మాయాజాలంతో ఎన్నో సార్లు తమ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మధ్య అభిమానులతో సోషల్ మీడియా లైవ్ లో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా 1999లో తన భార్యతో జరిగిన ఓ ఫన్నీ సంఘటన గుర్తుచేసుకున్నాడు. అయితే 1999 సంవత్సరం ప్రపంచ కప్ లండన్ లో జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్లిన పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు తమ భార్యలను వెంట తీసుకెళ్లారు. ఆ జట్టులో  ముష్తాక్  కూడా ఒకడు. అప్పటికి తనకు పెళ్ళై కేవలం ఆరు నెలలు మాత్రమే అవుతుంది. ఇక ఆ టోర్నీ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లతో వారి భార్యలను తిరిగి పంపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆ విషయం గురించి  ముష్తాక్  వివరిస్తూ... పీసీబీ ఆ విధంగా ఆదేశాలు జారీ చేయగానే ఏం  చేయాలో నాకు తెలియలేదు. నేను నా భార్యను  పంపించకుండా నా రూమ్ లోనే ఉంచుకున్నాను. కాని ఒకసారి మా మేనేజర్ అలాగే మరో అధికారి అందరి ఆటగాళ్ల గదులు చెక్ చేస్తూ వస్తున్నారు. అలా నా గది తలుపు కొట్టగానే నేను నా భార్యను అల్మారాలో దాచిపెట్టాను. వారు వచ్చి గది చూసి వెళ్లిపోయారు వారికి నా భార్య కనిపించలేదు. అయితే తార్వత కొంత సమయానికి మా జట్టు ఆటగాళ్లు ఇద్దరు నా గదిలోకి వచ్చారు, వారు నా భార్య అక్కడ ఉన్న విషయాన్ని కనిపెట్టారు. దాంతో నేను వారికి నిజం చెప్పేసాను అని ముష్తాక్ ఆ సంఘటనను వివరించాడు.