సంక్రాంతి స్పెషల్ : హైదరాబాద్ లో భారీ చోరీలు

సంక్రాంతి స్పెషల్ : హైదరాబాద్ లో భారీ చోరీలు

సంక్రాంతి పండుగ సమయంలో దొంగలు రెచ్చిపోయారు. ఎక్కడ దొంగతనం చేసినా కనీసం 5 ఇళ్లను ఆ గ్యాంగ్ లు టార్గెట్ చేస్తున్నాయి. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా కానిస్టేబుల్ ఇంటికే కన్నం వేసింది అంతర్రాష్ట్ర ముఠా. వారం రోజుల వ్యవధిలోనే 15 చోరీలకు దొంగల ముఠా సభ్యులు  పాల్పడ్డారు. సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగులు ఇంకా సంచరిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ముందస్తు హెచ్చరికలతో విలువైన బంగారు ఆభరణాలు డబ్బులను ఇళ్లల్లో అయితే జనాలు పెట్టలేదని అంటున్నారు. సైబరాబాద్ పరిధిలో ఆటోలతో ప్రతి గల్లీలో పోలీసులు హెచ్చరించారు. తూగుంటలో ఒక్క రోజే ఐదు ఇళ్లలో అంతరాష్ట్ర ముఠా సభ్యులు చోరీలకు పాల్పడ్డారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్లలో చోరీ జరిగింది. బాలనగర్ జోన్లో వారం రోజుల వ్యవధిలోనే అంతర్రాష్ట్ర ముఠా 20 చోరీల పాల్పడింది. సీసీ కెమెరాలు లేని ప్రదేశాలని గ్యాంగ్స్ టార్గెట్ చేస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు నగర శివారు ప్రాంతాలలో అధిక చోరీలు అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ పోలీస్ వ్యవస్థను రెట్టింపు చేశారు పోలీసులు.