ఆ ప్రశ్న నా జీవితాన్నే మార్చేసింది : సంజు సామ్సన్ 

ఆ ప్రశ్న నా జీవితాన్నే మార్చేసింది : సంజు సామ్సన్ 

ఐపీఎల్ 2020 లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడుసంజు సామ్సన్  అదరగొడుతున్నాడు. మొదట చెన్నై తో జరిగిన మ్యాచ్ లో 32 బంతుల్లో 72 రన్స్ బాదిన సామ్సన్ నిన్న పంజాబ్ పైన 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సులతో 85 రన్స్ చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ రెండు మ్యాచ్ లలోను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గా సంజునే నిలిచాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తర్వాత సామ్సన్ మాట్లాడుతూ... గత ఏడాది కాలంగా నా ఆటతీరులో స్పష్టమైన మార్పు నేను గమనించాను. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ మంచి స్కోర్లు సాధించాను. దీంతో జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలనుకున్నాను. అయితే గత ఏడాది బాగా ఆడలేకపోయాను. దీంతో ''జీవితంలో ఏం సాధించాలి..? కెరీర్ ముగిసేలోగా నేను ఎక్కడ ఉండాలి? అని అంటూ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు.. మరో పదేళ్లపాటు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. అందుకే క్రికెట్ కోసమే పూర్తి సమయం కేటాయించాలని భావించాను. నా శక్తిసామర్థ్యాలన్నీ ఆటపైనే కేంద్రీకరించాను. ఫలితాలు అవే వచ్చాయి. అయితే బాగా ఆడాలంటే ఫిట్‌గా ఉండాలి. అందుకే ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెట్టాను. భారీ షాట్లు ఆడటం కోసం కండలు పెంచేలా కసరత్తులు చేశాను'' అని సంజు సామ్సన్ తెలిపాడు.