కేజీఎఫ్2 కోసం హైదరాబాద్‌కు వచ్చిన దత్
ప్రస్తుతం భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమాలలో కేజీఎఫ్2 కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో చాలా వరకు షూటింగ్ పర్తయింది. మరి కొన్ని కీలక సన్నివేశాల కోసం ముఖ్య నటీనటులు హదరాబాద్ చేరుకున్నారు. వారిలో హీరో యశ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఉన్నారు. అయితే ఈ షూటింగ్ హైదరాబాద్‌లో మరో రెండు మూడు వారాలు జరగనుంది. వచ్చే నెల చిరికి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాకు తెలుగు మరియు హిందీ భాషల్లోనూ మంచి టాక్ ఉంది. భారీ అంచనాలతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దానితో పాటుగా వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. సినిమా విడుదల థియేటర్ల ఓపెనింగ్‌ను బట్టీ ఉంటుందని అంటున్నారు. మరి కేజీఎఫ్2 దాని మొదటి భాగంలో అందరిని అలరిస్తుందా, ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా అన్నా అనుమానాలు చాలా వరకు ఉన్నాయి. వీటికి సినిమా విడుదలైతేనే సమాధానాలు వస్తాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)